Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేం నరేందర్ రెడ్డికి మరోమారు నోటీసులు... టీ ఏసీబీ సన్నాహాలు?

ఓటుకు నోటు కేసులో టీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డికి అప్పుడే కష్టాలు తొలగేలా లేవు. ఇప్పటికే ఆయనను ఓసారి విచారించిన తెలంగాణ ఏసీబీ అధికారులు మొన్న, నిన్న ఆయన కొడుకు కృష్ణకీర్తన్ ను గంటల తరబడి ప్రశ్నించారు. అయితే వీరిద్దరి నుంచి ఏసీబీ అధికారులు పెద్దగా రాబట్టిందేమీ లేదన్న వాదన వినిపిస్తోంది. అయితే ఆడియో టేపులపై ఫోరెన్సిక్ నివేదిక దరిమిలా వేం నరేందర్ రెడ్డికి కేసులో ప్రత్యక్ష ప్రమేయం ఉందని ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను మరోమారు విచారణకు పిలవాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారట. ఈ మేరకు నేడో, రేపో ఆయనకు ఏసీబీ నుంచి తాఖీదులు అందనున్నాయని తెలుస్తోంది.

More Telugu News